శంషాబాద్ - తిరుపతి ఫ్లైట్‌లో సాంకేతిక లోపం .. సర్వీస్‌ను రద్దు చేసిన స్పైస్ జెట్ ఎయిర్ వేస్
- రన్ వే పై వెళ్తుండగా సాంకేతిక లోపం గుర్తించిన పైలట్
- అధికారులకు సమాచారం ఇచ్చిన పైలట్
- మరో విమానంలో ప్రయాణికులను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
శంషాబాద్ నుండి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆ విమాన సర్వీసును రద్దు చేశారు. తిరుపతికి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్జీ - 2138 విమానం రన్ వేపై వెళ్తుండగా పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే పైలట్ సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
దీంతో తిరుపతికి వెళ్లాల్సిన ఈ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ఎయిర్ వేస్ అధికారులు ప్రకటించారు. ఈ విమానంలో తిరుపతికి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరో విమానంలో పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.