మాజీ భార్య కోసం దొంగగా మారిన నాగ్ పూర్ వాసి.. కారణం ఇదే..!
- విడాకుల తర్వాత నెలనెలా భరణం చెల్లించాలని కోర్టు తీర్పు
- ఉద్యోగం లేకపోవడంతో భరణం చెల్లించలేక ఇబ్బందులు
- చైన్ స్నాచింగ్ చేస్తూ మాజీ భార్యకు డబ్బులు పంపించిన వైనం
విచారణలో చైన్ స్నాచింగ్ కు పాల్పడింది తానేనని కన్హయ్య అంగీకరించాడు. కొంతకాలంగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నానని చెప్పాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా.. నెలనెలా రూ.6 వేలు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని వివరించాడు. సంపాదన లేకపోవడంతో భరణం చెల్లించేందుకు దొంగగా మారినట్లు తెలిపాడు. ఇప్పటివరకు నాలుగుసార్లు చైన్లు దొంగిలించినట్లు చెప్పాడు. చోరీ చేసి తీసుకొచ్చిన బంగారాన్ని స్థానిక నగల వ్యాపారికి అమ్మానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ వ్యాపారిని కూడా అరెస్టు చేశారు.