ఆర్మాక్స్ 2025 లేటెస్ట్ లిస్ట్.. ఇండియా నెం.1 హీరోగా ప్రభాస్

  • జూన్‌కు సంబంధించి పాప్యులర్ నటీనటుల జాబితాను విడుదల చేసిన ఆర్మాక్స్
  • ఈ జాబితాలో సత్తా చాటిన టాలీవుడ్ స్టార్లు 
  • హీరోల లిస్ట్‌లో టాప్ 10లో మొత్తం ఆరుగురు మన తెలుగు హీరోలే 
  • మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ల జాబితాలో సమంతకు మరోసారి అగ్ర‌స్థానం
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌ (Ormax) తాజాగా మోస్ట్‌ పాప్యులర్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. జూన్ నెల‌కు సంబంధించి పాప్యులర్ నటీనటుల జాబితాను ఆర్మాక్స్ శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ స్టార్లు సత్తా చాటారు. హీరోల‌ లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి నంబ‌ర్ వ‌న్‌గా నిలిచారు. అలాగే మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ల జాబితాలో సమంత మరోసారి అగ్ర‌స్థానం ద‌క్కించుకున్నారు. 

ఇక‌, హీరోల జాబితాలో టాప్ 10లో మొత్తం ఆరుగురు మన తెలుగు హీరోలే ఉండడం విశేషం. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూడో స్థానంలో ఉంటే.. సూప‌ర్ స్టార్‌ మహేశ్ బాబు ఆరో స్థానం దక్కించుకున్నారు. ఆయ‌న త‌ర్వాత యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ ఏడు, గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్ ఎనిమిది, నేచుర‌ల్ స్టార్‌ నాని 10వ స్థానంలో నిలిచారు. 

మరోవైపు మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ల జాబితాలో సమంత మరోసారి టాప్‌లో నిలిచారు. ఈ లిస్ట్ లో ఇప్పటికే పలుమార్లు టాప్ ప్లేస్ దక్కించుకున్న సమంత తాజాగా మరోసారి అగ్ర‌స్థానం కైవ‌సం చేసుకున్నారు. కొంతకాలం నుంచి సినిమాలు చేయకపోయినా సమంత టాప్‌లో ఉండడం విశేషం. ఆమె చివరిసారిగా 'సిటాడెల్-హన్ని బన్నీ' వెబ్ సిరీస్ తో సినీ ప్రియుల్ని అలరించారు. ఆ త‌ర్వాత ఆమె నిర్మాత‌గా మారి తీసిన శుభం మూవీలో అతిథి పాత్ర‌లో క‌నిపించారు. కాగా, హీరోయిన్ల జాబితాలో స‌మంత తర్వాత బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ రెండో స్థానంలో ఉంటే.. దీపికా పదుకొణె మూడో స్థానం దక్కించుకున్నారు. అలాగే త్రిష, కాజల్ అగర్వాల్, సాయి పల్లవి వ‌రుస‌గా 4, 5, 6 ర్యాంకుల్లో నిలిచారు.  

ఆర్మాక్స్‌ టాప్ 10 హీరోల జాబితా ఇదే
1. ప్రభాస్
2. దళపతి విజయ్
3. అల్లు అర్జున్
4. షారుక్ ఖాన్
5. అజిత్ కుమార్
6. మహేశ్ బాబు
7. జూనియర్ ఎన్టీఆర్
8.రామ్ చరణ్
9. అక్షయ్ కుమార్
10. నాని

ఆర్మాక్స్ టాప్ 10 హీరోయిన్లు వీళ్లే..
1. సమంత
2. ఆలియా భట్
3. దీపికా పదుకొణె
4. త్రిష
5. కాజల్ అగర్వాల్
6. సాయి పల్లవి
7. నయనతార
8. రష్మిక మంధన్నా
9. కీర్తి సురేశ్
10. తమన్నా భాటియా


More Telugu News