ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు.. స్పందించిన బండి సంజయ్
- కేసీఆర్ చేసిన పాపాల వల్ల నోటీసులు వచ్చాయన్న బండి సంజయ్
- తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపణ
- తనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానన్న బండి సంజయ్
ఈ లేఖపై బండి సంజయ్ స్పందిస్తూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుంచి తనకు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబం, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. పడకగదిలో దంపతుల మాటలను కూడా ట్యాప్ చేసి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. తనకు తెలిసిన, తన వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని ఆయన అన్నారు.