హైదరాబాద్‌లో బాక్సింగ్ పోటీల్లో ఉద్రిక్తత.. బాక్సర్లు, కోచ్‌ల ఘర్షణ
- షేక్‌పేటలో రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు
- రిఫరీ తప్పుడు నిర్ణయం కారణంగా ఓడిపోయానంటూ ఓ బాక్సర్ వర్గీయుల దాడి
- తలుపులు, కిటికీలు ధ్వంసం
రిఫరీ తప్పుడు నిర్ణయం కారణంగానే తాను ఓటమి పాలయ్యానంటూ ఒక బాక్సర్ వర్గం అతడిపై దాడికి పాల్పడింది. ఈ ఘర్షణలో తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు గోల్కొండ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి.