జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చిన నాగవంశీ
- తారక్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న పౌరాణిక చిత్రం
- వచ్చే ఏడాది మధ్యలో షూటింగ్ ప్రారంభిస్తామన్న నాగవంశీ
- ఎన్టీఆర్ ను దేవుడిగా చూపిస్తున్నాననే ఆనందం తనకు ఉందని వ్యాఖ్య
ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ పౌరాణిక చిత్రం రానున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ రేంజ్ లో నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి నాగవంశీ కీలక అప్డేట్ ఇచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ ను రాముడిగా, కృష్ణుడిగా చూసిన తనకు జూనియర్ ఎన్టీఆర్ ను దేవుడుగా చూపిస్తున్నాననే ఆనందం ఉందని నాగవంశీ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వెంకటేశ్, త్రివిక్రమ్ సినిమా ఆగస్ట్ నుంచి ప్రారంభమవుతుందని... వచ్చే ఏడాది మధ్యలో తారక్ తో సినిమాను ప్రారంభిస్తామని తెలిపారు.
విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నాగవంశీ అన్నారు. ఆయనను ప్రేక్షకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా 'వార్ 2' ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి నాగవంశీ మాట్లాడుతూ... ఈ చిత్రంలో తారక్ పరిచయ సన్నివేశం సినిమాకే హైలైట్ గా ఉంటుందని చెప్పారు. తారక్, హృతిక్ ల మధ్య ఫైటింగ్ సీన్ అద్భుతంగా ఉంటుందని... ఆ ఒక్క సీన్ చూసే తాను ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారనేది వదంతులు మాత్రమేనని... ఇద్దరికీ సమానమైన నిడివి ఉందని చెప్పారు.