ఆసుపత్రిలో రోగిపై అత్యాచారయత్నం.. హైదారాబాద్ లో అమానుషం




హైదరాబాద్ విద్యానగర్ లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ పట్ల వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారయత్నం చేయడంతో భయాందోళనకు గురైన బాధితురాలు కేకలు వేసింది. పేషంట్ అరుపులతో ఆసుపత్రి సిబ్బంది, రోగి బంధువులు అప్రమత్తమయ్యారు. వార్డ్ బాయ్ ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వార్డ్ బాయ్ ని అదుపులోకి తీసుకున్నట్లు నల్లకుంట పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


More Telugu News