బీహార్ లో బంగ్లాదేశీయులకూ ఓటుహక్కు
- ఓటర్ జాబితాలో నేపాల్, మయన్మార్ పౌరుల పేర్లు
- ఎలక్షన్ కమిషన్ సవరణ సర్వేలో బయటపడుతున్న అక్రమాలు
- అనర్హులను ఏరివేస్తామంటున్న ఈసీ అధికారులు
ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ సర్వేపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించాయి. అనర్హుల పేరుతో ప్రతిపక్షాల ఓటు బ్యాంకును ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకే ఈ సర్వే చేపట్టిందని ఆరోపించాయి. ఈ విషయంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈసీ చేపట్టిన సర్వే రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఎన్నికల ముందు సర్వే చేయడంపై ఈసీని ప్రశ్నించింది.