టీమిండియాకు ఆధిక్యం దక్కలేదు... స్కోర్లు సమం!

  • లార్డ్స్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
  • సరిగ్గా టీమిండియా కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్
లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమం కావడంతో ఉత్కంఠ రేగింది. నేడు మూడో రోజు ఆటలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులే చేసింది. 

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (100) సెంచరీతో అదరగొట్టాడు. రిషబ్ పంత్ (74), రవీంద్ర జడేజా (72) అర్ధసెంచరీలతో జట్టుకు బలం చేకూర్చారు. కరుణ్ నాయర్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (30) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్ (13), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపరిచారు. 




More Telugu News