వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- 345 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
- 120 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి ప్రధాన కారణం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా రెండో సెషన్‌లోనూ అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత, కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు భారీ నష్టాలతో ముగియగా, నిఫ్టీ కీలకమైన 25,400 స్థాయిని కోల్పోయింది.
ఉదయం 83,658 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, ఆ జోరును నిలబెట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 83,134 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి, చివరికి 345 పాయింట్ల నష్టంతో 83,190 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 120 పాయింట్లు కోల్పోయి 25,355 వద్ద ముగిసింది.
టీసీఎస్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. అదేవిధంగా భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, బీఈఎల్ షేర్లు సూచీల పతనానికి కారణమయ్యాయి.
మరోవైపు మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.44 డాలర్లుగా ఉండగా, ఔన్సు బంగారం ధర 3,331 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.67 వద్ద కొనసాగుతోంది.