వైద్యుల సూచన మేరకు యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్

  • హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్
  • వైద్యుల సూచన మేరకే ఆసుపత్రిలో అడ్మిట్
  • కొనసాగుతున్న తదుపరి వైద్య పరీక్షలు
  • ఇటీవలే చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన మాజీ ముఖ్యమంత్రి
  • వారం రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ చేరిక
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు గురువారం ఆయన హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్, చికిత్స అనంతరం ఈ నెల 5న డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో రక్తంలో షుగర్, సోడియం స్థాయులను పర్యవేక్షించేందుకు ఆయనకు వైద్యులు చికిత్స అందించారు.

డిశ్చార్జ్ సమయంలో వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాత తదుపరి పరీక్షల కోసం మళ్లీ రావాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు వారం రోజుల విశ్రాంతి అనంతరం కేసీఆర్ మళ్లీ ఆసుపత్రికి వెళ్లారు.


More Telugu News