నవోదయలో 6వ తరగతి ప్రవేశాలు.. దరఖాస్తులకు జూలై 29 చివరి తేదీ!
- నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
- 2026-27 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో జూలై 29 వరకు అవకాశం
- తెలుగు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13న జరగనున్న ప్రవేశ పరీక్ష
- గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు రిజర్వ్
- ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు పూర్తి ఉచితంగా విద్య, వసతి
దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నవోదయ విద్యాలయ సమితి సూచించింది. నవోదయ పాఠశాలల్లో సీటు సాధిస్తే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య, వసతి పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 654 నవోదయ విద్యాలయాలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం రెండు దశల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13న పరీక్ష జరగనుంది. కొన్ని పర్వత ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం 2026 ఏప్రిల్ 11న నిర్వహిస్తారు. విద్యార్థులు తాము ప్రవేశం కోరుకుంటున్న జిల్లాలోనే 5వ తరగతి చదువుతూ ఉండాలి.
మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. గ్రామీణ కోటా కోసం విద్యార్థులు 3, 4, 5 తరగతులను తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో పూర్తిచేయాలి. బాలికల కోసం మూడో వంతు సీట్లు రిజర్వ్ చేశారు. వీటితో పాటు ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ప్రవేశ పరీక్షను 100 మార్కులకు 80 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రెండు గంటల పాటు నిర్వహిస్తారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. ఇక్కడ చదివే విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కూడా సిద్ధం చేస్తారు. ఒక్కో నవోదయ పాఠశాలలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. బాలబాలికలకు విడిగా వసతి కల్పిస్తారు.