Vijay: విడాకులు కోరిన భార్య సంగీత... స్పందించిన సినీ నటుడు విజయ్
- వ్యక్తిగత విషయాలు అభిమానులను ఇబ్బంది పెడుతుంటే బాధగా ఉందన్న విజయ్
- నా వ్యక్తిగత విషయాలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసన్న విజయ్
- కార్యకర్తలు, అభిమానులు సమస్యలపై పోరాటం చేయాలని సూచన
తన భార్య విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంపై ప్రముఖ తమిళ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పందించారు. నా వ్యక్తిగత విషయాలు మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంటే బాధగా ఉందని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు. వాటి విషయం తాను తర్వాత చూసుకుంటానని అన్నారు. చెంగల్పట్టులో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవల తనకు ఎదురవుతున్న సమస్యలు, బాధల గురించి కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆలోచించవద్దని సూచించారు.
తన సమస్యలపై మీరు పోరాటం చేసి అవతలి వారిని బాధించవలసిన అవసరం ఏమాత్రం లేదని అన్నారు. వాటిని నేను చూసుకుంటాను, మీరు మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. వ్యక్తిగత విషయాలు ఎలా పరిష్కరించుకోవాలో తనకు తెలుసని విజయ్ అన్నారు. కానీ ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నాకు బాధగా ఉందని అన్నారు.
విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో కొన్నిరోజుల క్రితం విడాకుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా తన విడాకుల కేసు విచారణ ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.