ఇరాన్‌తో యుద్ధం... సురక్షితంగా స్నానం చేయడానికి 'కెన్ ఐ షవర్'ను ఉపయోగిస్తున్న ఇజ్రాయెలీలు
- ఇరాన్‌తో ఎనిమిదో రోజుకు చేరిన ఇజ్రాయెల్ యుద్ధం
- ఇజ్రాయెలీల దైనందిన జీవితంపై ప్రభావం
- కెన్ ఐ షవర్ యాప్ ద్వారా అలర్ట్స్ తెలుసుకుంటున్న ప్రజలు
యుద్ధ భయంతో చాలామంది స్నానం చేయడానికి కూడా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో 'కెన్ ఐ షవర్'ను ఉపయోగించి ఏ సమయంలో స్నానం చేయడం సురక్షితమో తెలుసుకుంటున్నారు. క్షిపణుల ప్రమాదం ఉన్నసమయంలో స్థానిక యంత్రాంగం ప్రజలకు అలర్ట్స్ ఇస్తోంది. దానితో పాటు సైరన్లు మోగుతుంటాయి. ఆ సమయంలో బాంబు షెల్టర్లు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి 30 సెకన్ల నుంచి 90 సెకన్లకు మించి సమయం ఉండదని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో స్నానం చేస్తూ ఉంటే అలర్ట్స్ వినపడటం, పరుగెత్తడం కష్టమవుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 'కెన్ ఐ షవర్'ను ఉపయోగిస్తున్నారు. ఇది అధికారిక భద్రతా వ్యవస్థ కాకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో సహాయకారిగా ఉంటోంది. అయితే దీనిపై పూర్తిగా ఆధారపడలేమని ఇజ్రాయెల్ ప్రజలు చెబుతున్నారు. రాకెట్ అటాక్ ప్యాటర్న్స్, అలర్ట్ డేటాను పరిశీలించి ఈ యాప్ అవుట్‌పుట్ ఇస్తుంది.