శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
--
అయితే, డ్యామ్ నుంచి ప్రస్తుతానికి నీటిని వదలడంలేదని తెలిపారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 854.20 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు, ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరిందని అధికారులు వివరించారు. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని చెప్పారు.