అమెరికా చాలా పెద్ద తప్పు చేసింది.. ఫలితం అనుభవించాల్సిందే: ఇరాన్

  • మీరు మొదలు పెట్టారు.. మేం పూర్తిచేస్తామన్న టెహ్రాన్
  • ఇకపై పశ్చిమాసియాలో అమెరికన్లకు స్థానంలేదని వ్యాఖ్య
  • ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలే మా టార్గెట్.. హౌతీల హెచ్చరిక
ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతి పెద్ద తప్పు చేసిందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. తమ భూభాగంపై వైమానిక దాడులు జరపడంపై తాజాగా స్పందించింది. ‘దాడులు మీరు మొదలు పెట్టారు.. మేం పూర్తిచేస్తాం’ అని పేర్కొంది. ఇకపై అమెరికన్లకు, అమెరికా సైన్యానికి పశ్చిమాసియాలో చోటులేదని తేల్చిచెప్పింది.

పశ్చిమాసియాలోని అమెరికన్లను, అగ్రరాజ్యం స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ లో అమెరికా వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని హౌతీలు శపథం చేశారు. ఎర్ర సముద్రంలోని అమెరికా నౌకలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత మరింత పెరగనుంది.


More Telugu News