Viratapalem: పెళ్లిరోజే చనిపోయే పెళ్లికూతుళ్లు .. జీ 5లో 'విరాటపాలెం' సిరీస్!

Viratapalem Series Update
షార్ట్స్‌లో చూడండి
థ్రిల్లర్ టచ్ తో సాగే సినిమాలకు .. సిరీస్ లకు ఓటీటీ వేదికపై చాలా క్రేజ్ ఉంది. ఈ తరహా కంటెంట్ తో వచ్చిన సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ కాన్సెప్ట్ లు ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. దాంతో ఓటీటీ సంస్థలు ఈ తరహా కంటెంట్ ను అందించడానికి పోటీ పడుతున్నాయి. అలా సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సిరీస్ గా, 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్' కనిపిస్తోంది. 

కృష్ణ పోలూరు ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. గతంలో 'రెక్కీ' సిరీస్ ను అందించిన నిర్మాతలే ఈ సిరీస్ ను నిర్మించారు. అభిజ్ఞ - చరణ్ లక్కరాజు ప్రధానమైన పాత్రలను పోషించారు. 'జీ5'వారు ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

1980ల కాలంలో ఈ కథ నడుస్తుంది. 'విరాటపాలెం' ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలోని యువతులను పెళ్లి చేసుకోరు. పెళ్లి రోజునే పెళ్లి కూతురు చనిపోతూ ఉండటమే అందుకు కారణం. ఇలా జరగడాన్ని తమ గ్రామానికి గల శాపంగా వాళ్లు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ కానిస్టేబుల్ అభిజ్ఞ ఆ ఊరు వస్తుంది. జరుగుతున్న సంఘటనలపై ఆమెకి అనుమానం కలుగుతుంది. దాంతో అసలు రహస్యాన్ని కనిపెట్టడానికి రంగంలోకి దిగుతుంది. ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ. 

Go Back to Shorts
Viratapalem
Viratapalem series
Zee5
Abhigna
Charan Lakkaraju
Krishna Poluru
Telugu web series
Supernatural thriller
OTT platform
PC Meena Reporting

More Telugu News