ఏపీ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు శుభవార్త

  • ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు ఇకపైనా ఈహెచ్ఎస్ వైద్య సేవలు
  • బోర్డు సభ్యులకు ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వానికి సీఈఓ ప్రతిపాదన
  • బోర్డు సీఈవో ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. బోర్డు ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈహెచ్‌ఎస్ కింద వైద్య సేవలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఖాదీ, విలేజ్ బోర్డు ఉద్యోగులకు ఇకపైన కూడా ఈహెచ్‌ఎస్ వర్తింపజేయాలని బోర్డు సీఈవో ప్రతిపాదనలు పంపగా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీస్, కామర్స్ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖాదీ, విలేజ్ బోర్డు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News