అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పోలీస్ అధికారిపై అంబటి రాంబాబు మండిపాటు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై అంబటి సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు
అంబటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ, వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.