ఏపీ పోలీసుల ఏఐ హ్యాకథాన్... డీటెయిల్స్ ఇవిగో!

  • గుంటూరులో ఈ నెల 27 నుండి 29 వరకు ఏఐ హ్యాకథాన్
  • 27న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
  • ఏఐ హ్యాకథాన్‌లో యువ ఇంజినీర్లకు భాగస్వామ్యం 
  • పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంశాలను వివరించిన గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధులు
ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో పోలీసింగ్‌లో నాణ్యతను మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 27 నుండి 29 వరకు గుంటూరులో ఏఐ హ్యాకథాన్‌ నిర్వహించనుంది.

ఈ కార్యక్రమాన్ని 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరులోని ఆర్.వి.ఆర్ అండ్ జె.సి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో యువతరం తమదైన చొరవ చూపనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ సమన్వయంతో నిర్వహించే ఏఐ హ్యాకథాన్‌లో యువ ఇంజినీర్లకు భాగస్వామ్యం కల్పించారు.

దీంతో యువ ఇంజినీర్లు ఇందుకు సంబంధించి వర్క్‌ను ప్రారంభించారు. కార్యక్రమ నిర్వహణలో వారి పాత్ర, కృత్రిమ మేధ ఉపయోగాలు, పోలీసింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంశాలపై గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు వివరించారు.


More Telugu News