ఆపరేషన్ సిందూర్‌లో 9 పాక్ విమానాలు ధ్వంసం
- పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'
- పాకిస్థాన్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు, రెండు నిఘా విమానాలు ధ్వంసం
- పదికి పైగా సాయుధ డ్రోన్లు, సీ-130 రవాణా విమానం నేలమట్టం
- పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారత వైమానిక దాడులు, కీలక స్థావరాలు టార్గెట్
సైనిక ఘర్షణ అనంతరం జరిపిన విశ్లేషణలో పాకిస్థాన్ వైమానిక, భూతల సైనిక ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్పష్టమైంది. భారత వైమానిక దళం జరిపిన ఎదురుదాడుల్లో ఈ ఆరు పీఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోనే నేలకూలాయి. పాకిస్థానీ పంజాబ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాల్లో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాడార్ ట్రాకింగ్, భారత భూస్థిత క్షిపణి వ్యవస్థలు, గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు నమోదు చేసిన థర్మల్ సిగ్నేచర్ల ద్వారా ఈ విమానాల విధ్వంసాన్ని ధ్రువీకరించినట్టు సమాచారం. దాడుల అనంతరం ఈ విమానాలు ట్రాకింగ్ గ్రిడ్ల నుంచి అదృశ్యమైనట్లు ఈ వర్గాలు పేర్కొన్నాయి.