శ్రీవారి సేవ‌లో సోనూ సూద్‌

  • ఈరోజు తెల్ల‌వారుజామున‌ కుటంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకున్న న‌టుడు
  • పాతికేళ్ల క్రితం తొలిసారి శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ట్లు చెప్పిన సోనూ సూద్‌
  • 'నంది' పేరుతో కొత్త సినిమాను ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డి
ప్రముఖ నటుడు సోనూ సూద్‌ తిరుమల శ్రీవారి సేవ‌లో పాల్గొన్నాడు. ఈరోజు తెల్ల‌వారుజామున‌ కుటంబ సభ్యులతో కలిసి స్వామివారిని ద‌ర్శించుకున్నాడు. వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆల‌య అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారి దర్శనానంతరం సోనూ సూద్‌ ఆలయం వెలుపల విలేక‌రుల‌తో మాట్లాడారు. "నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఈరోజు నేను నా కుటుంబంతో క‌లిసి ఇక్కడికి వచ్చాను. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించాను. మేము ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. 'నంది' అనే పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ కొత్త చిత్రంలో నేను నటించ‌డంతో పాటు దర్శకత్వం కూడా వ‌హిస్తున్నా. ఇది త్వరలో ప్రారంభమవుతుంది" అని వెల్ల‌డించారు.  




More Telugu News