సూప‌ర్‌స్టార్ కృష్ణకు నివాళులు అర్పించిన హీరో సుధీర్ బాబు.. ‘జటాధర’ టీమ్

    
లెజెండరీ సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌యంతి (మే 31) సంద‌ర్భంగా ‘జ‌టాధ‌ర’ చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ నటుడికి నివాళులు అర్పించింది. తెలుగు సినీ ప్ర‌పంచంలో శాశ్వ‌త‌ ప్ర‌భావం చూపించిన శ‌క్తిగా కృష్ణను ‘జ‌టాధ‌ర’ చిత్ర‌యూనిట్ స్మ‌రించుకుంది. ‘హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చర్మిష్మా’ అంటూ శ్లాఘించింది. 

ప్ర‌తిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘జ‌టాధర’ సినిమా షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించింది. పాన్ ఇండియా మూవీగా సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జ‌టాధర’ను తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు, శిల్పా శిరోద్క‌ర్‌, ర‌వి ప్ర‌కాష్‌, ఇంద్రకృష్ణ‌, న‌వీన్ నేని, శుభ‌లేఖ సుధాక‌ర్‌, రాజీవ్ క‌నకాల‌, ఝాన్సీ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేర‌ణ అరోరా, శివ‌న్ నారంగ్‌, అరుణ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. అక్ష‌య్ క్రేజీవాల్‌, కుస్సుమ్ అరోరా స‌హ నిర్మాత‌లుగా, దివ్యావిజ‌య్ క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, భ‌వానీ గోస్వామి సూప‌ర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌గా జ‌టాధ‌ర సినిమా తెర‌కెక్కుతోంది. 


More Telugu News