అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ఉత్తర్వులు

  • క్వాంటం వ్యాలీ పార్క్ నిర్మాణానికి మూడు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం
  • 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్దం చేయాలన్న లక్ష్యంతో అడుగులు
  • ఎంవోయూను ర్యాటిపై చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ఐటీ శాఖ జారీ చేసింది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ పార్క్ నిర్మాణానికి మూడు ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ), ఐబీఎం సంస్థలు ఈ పార్క్‌ను నిర్మించనున్నాయి.

ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ క్వాంటం సిస్టం – 2 ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలతో పాటు క్వాంటంపై పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను అందించనుంది. ఎల్ అండ్ టీ క్లయింట్ నెట్‌వర్క్, స్టార్టప్‌ల నిర్వహణకు అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని అందించనుంది. 


More Telugu News