ఐపీఎల్-2025 ఎలిమినేటర్... గుజరాత్ పై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

  • ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ వర్సెస్ ముంబై 
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
  • న్యూ చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియం వేదిక
  • గెలిచిన జట్టు ముందుకు, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ (జీటీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి అర్హత సాధిస్తుంది.

ఈ నేపథ్యంలో, నేటి ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇంండియన్స్ ఇరు జట్లకు అత్యంత కీలకం. దీంతో ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమయ్యాయి.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, గెరాల్డ్ కోయిట్జీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.

బెంచ్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ, దసున్ షనక, కరీం జనత్, కుల్వంత్ ఖేజ్రోలియా, మానవ్ సుతార్, కుమార్ కుశాగ్ర, గుర్నూర్ బ్రార్, నిశాంత్ సింధు.

సపోర్ట్ స్టాఫ్: ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకి, పార్థివ్ పటేల్, నయీమ్ అమీన్, నరేందర్ నేగి.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధిర్, రాజ్ బావా, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్.

బెంచ్: రాబిన్ మింజ్, రఘు శర్మ, అశ్వని కుమార్, రీస్ టోప్లీ, కృష్ణన్ శ్రీజిత్, చరిత్ అసలంక, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, సత్యనారాయణ రాజు, బెవాన్ జాకబ్స్, అర్జున్ టెండూల్కర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.
సపోర్ట్ స్టాఫ్: కీరన్ పొలార్డ్, సచిన్ టెండూల్కర్, లసిత్ మలింగ, జగదీశ్ అరుణ్‌కుమార్, మహేల జయవర్ధనే, కార్ల్ హాప్కిన్సన్.

ఈ ఉత్కంఠభరిత పోరులో ఏ జట్టు విజయం సాధించి టోర్నీలో ముందుకు సాగుతుందో చూడాలి. ఇరు జట్లలోనూ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సమర్థులు ఉండటంతో అభిమానులకు హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది.


More Telugu News