నాలాంటివారు ఇకపై రారు: ఇళయరాజా
- నా గురించి నేనే చెప్పుకోవాలి
- లోకంలో నాలాంటి వారు లేరు
- నాకంటే ముందు నాలాంటి వారు రాలేదు
- ఇది దేవుడిచ్చిన వరమన్న ఇళయరాజా
సినిమా పాట గురించి తెలిసినవారికి ఇళయరాజా పేరు తెలియకుండా ఉండదు. స్వరాల మాంత్రికుడిగా ఆయనకి పేరు ఉంది. పోస్టర్ పై ఉన్న ఆయన పేరే ప్రేక్షకులను సినిమాలకు రప్పించిన రోజులున్నాయి. ఆయన పాటల కారణంగానే విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ఆయన అందించిన పాటల కారణంగా పాప్యులర్ అయిన హీరోలున్నారు. ఆయన అంతటి వేగంగా బాణీలు కట్టే సంగీత దర్శకులు బహుకొద్ది మంది అనే చెప్పాలి.
అలాంటి ఇళయరాజా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " పాండిత్యం ఉన్నవారు తమ గురించి తామే చెప్పుకోవాలి. లేకపోతే ఎవరికీ తెలియదు. అలా నా గురించి నేను మాత్రమే చెప్పుకోవాలి. నా విషయానికి వస్తే, లోకంలో నాలాంటివారు లేరు .. ఇకపై నాలాంటివారు వస్తారా అంటే రారు అనే చెబుతాను. నాకంటే ముందు నాలాంటివారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే చెబుతాను" అని అన్నారు.
"సినిమా సంగీతానికి సంబంధించి చాలా గొప్పవారు ఉన్నారు. అయితే వాళ్లంతా కూడా ఎవరో ఒకరిని గురువుగా భావించి .. వారి దగ్గర నేర్చుకున్నారు. బాగా అనుభవం గడించిన తరువాత వాళ్లు సంగీతం చేయడం మొదలుపెట్టారు. కానీ నేను అలా కాదు .. ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ఒక కుగ్రామంలో పుట్టిపెరిగాను. అక్కడ సంగీతం నేర్చుకునే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ స్థాయికి నేను రావడానికి కారణం ఆ దేవుడే. ఇది ఆయన ఇచ్చిన వరంగానే నేను భావిస్తూ ఉంటాను" అని అన్నారు.