అమెజాన్ ప్రైమ్ లో యాక్షన్ థ్రిల్లర్!
- యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా
- నేరుగా ఓటీటీ సెంటర్ కి వస్తున్న కంటెంట్
- కిడ్నాప్ చుట్టూ తిరిగే కథాకథనాలు
- జూన్ 4 వ తేదీ నుంచి సినిమా విడుదల
జూన్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమా, ఎన్నో ప్రశంసలను అందుకుంది. కేరళలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. శుభమ్ తో పాటు హరీశ్ ఖన్నా .. మియా మల్జేర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
గౌతమ్ - రామన్ ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ల కళ్లముందే ఒక పాపను కొంతమంది దుండగలు అపహరిస్తారు. అన్నదమ్ములిద్దరూ ఆ పాపను రక్షించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లిద్దరూ ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది మిగతా కథ. జూన్ 4న రానున్న ఈ సినిమా, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.