ట్రంప్ పేరుతో యాప్.. కర్ణాటకలో 150 మందికి కుచ్చుటోపీ
- పెట్టుబడి పెడితే భారీ లాభాలు అంటూ వల
- నమ్మి డబ్బులు పెట్టిన 150 మంది
- రూ.కోటికి పైగా వసూలు చేసి పరారైన మోసగాళ్లు
సైబర్ నేరస్తులు వారికి అమెరికా ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు నకిలీ పత్రాలను తయారుచేసి ఇచ్చారు. తొలినాళ్లలో లాభాలు వచ్చినట్లు చూపిస్తూ కొద్దిమొత్తంలో డబ్బులు తిరిగి ఇచ్చారు. ఇలా వారిని నమ్మించి మరింత సొమ్ము వసూలు చేశారు. మొత్తంగా రూ.కోటికి పైగా వసూలు చేసి ఫోన్లు స్విచ్ఛాప్ చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.