కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో అలియా భ‌ట్ సంద‌డి.. ఫ్యాన్స్‌ను స్ట‌న్ చేసేలా బ్యూటీ ఫొటోలు

  • త‌న లుక్‌కి సంబంధించిన స్ట‌న్నింగ్‌ ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేసిన బ్యూటీ
  • 'హ‌లో కేన్స్' క్యాప్ష‌న్‌తో అభిమానుల‌తో ఫొటోల‌ను పంచుకున్న అలియా
  • తొలిసారి కేన్స్ వేదిక‌పై తళుక్కుమన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ‌
ప్రతిష్ఠాత్మ‌క కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో అందాల ముద్దుగుమ్మ‌లు తెగ సంద‌డి చేస్తున్నారు. వెరైటీ డ్రెస్సుల‌లో వ‌చ్చి క‌నువిందు చేస్తున్నారు. ఈసారి కూడా భార‌త్ నుంచి మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్‌ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. మొదటి రోజున రెడ్ కార్పెట్‌పై చీరలో  ఈ భామ తళుక్కుమన్నారు. తాజాగా మ‌రో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ కూడా కేన్స్‌లో సంద‌డి చేశారు. 

తొలి రోజే ఆమె హాజ‌రు కావ‌ల్సి ఉన్న భార‌త్-పాక్ ఉద్రిక్త‌త‌ల నేపథ్యంలో త‌న ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఎట్ట‌కేలకు   వేడుక ముగిసే స‌మ‌యానికి అలియా భ‌ట్ కేన్స్ లో మెరిసి త‌మ అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. తొలిసారి కేన్స్‌లో అడుగుపెట్టిన అలియా సింపుల్ ఎంబ్రాయిడ‌రీ వర్క్ చేసిన ఫ్లోర‌ల్ గౌన్ ధ‌రించి నాజూగ్గా క‌నిపించారు. 

కేన్స్‌కి వెళ్లక ముందే త‌న స్ట‌న్నింగ్‌ లుక్‌కి సంబంధించిన ఫొటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'హ‌లో కేన్స్' అనే క్యాప్ష‌న్‌తో అభిమానుల‌తో పంచుకున్న ఈ ఫొటోల్లో కొంటె చూపుల్తోనే కాల్చి చంపేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మ‌డి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి. 

అయితే, మే 13 నుంచి 24 వ‌ర‌కు కేన్స్ ఫెస్టివ‌ల్ జ‌ర‌గ‌నుండగా, చివ‌రి క్ష‌ణాల‌లో వ‌చ్చి అలియా అల‌రించారు. ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇస్తూ వేడుక ముగిసే స‌మ‌యానికి వేదిక‌పై మెరిశారు. దీంతో అంత‌ర్జాతీయ వేదిక‌గా మెరిసిన తార‌ల జాబితాలో అలియా భ‌ట్ చేర‌డం ఆనందంగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 


More Telugu News