కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీకి రంగం సిద్ధం
- నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో చర్యలు
- దేశం విడిచి వెళ్లకుండా చూడాలని డీజీకి టీడీపీ ఫిర్యాదు
- తప్పుడు పాస్ పోర్ట్ తో విదేశాలకు వెళ్లేందుకు కొడాలి నాని ప్రయత్నం!
కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీకి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లేఖ రాశారు. దీంతో కొడాలి నాని కదలికలపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణ చిరునామాతో పాస్ పోర్ట్ సృష్టించుకుని ఆయన విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే కొడాలి నానిపై లుకౌట్ నోటీసుల జారీకి అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. లుకౌట్ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తి దేశం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారులు అడ్డుకుంటారు.