సల్మానే నన్ను రమ్మన్నాడు: పోలీసుల అదుపులో మహిళ!
- సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడేందుకు మహిళ విఫలయత్నం
- తాను మోడల్‌నని, సల్మానే ఆహ్వానించారని ఇషా చాబ్రియా వాదన
- అర్ధరాత్రి సమయంలో గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన
- సల్మాన్ కుటుంబం ఖండించడంతో పోలీసులకు ఫిర్యాదు
- అరెస్ట్ చేసి విచారిస్తున్న ముంబై పోలీసులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి ఓ మహిళ అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి కలకలం రేపింది. సల్మాన్ ఖానే తనను రమ్మన్నారని ఆమె చెప్పగా, అది నిజం కాదని తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన సల్మాన్ ఇంటి వద్ద భద్రతా లోపాలను మరోసారి చర్చనీయాంశం చేసింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇషాను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కూడా, సల్మాన్ తనను పిలిచారని ఆమె పదేపదే చెప్పినట్లు తెలిసింది. తాను ఖార్ ప్రాంతంలో నివసిస్తున్నానని, ఆరు నెలల క్రితం ఓ పార్టీలో సల్మాన్ ఖాన్‌ను కలిశానని ఇషా పోలీసులకు తెలిపింది. అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందని, ఆ పరిచయంతోనే ఆయన ఆహ్వానం మేరకు వచ్చానని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, సల్మాన్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను గట్టిగా ఖండించారు.
కాగా ఆ మహిళ తాను ఓ మోడల్ అని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.