ధాన్యం బస్తాలో రూ. లక్షన్నర దాచిన భర్త ... తెలియక అమ్మేసిన భార్య!
- ఎడ్లమ్మిన డబ్బులు వడ్ల బస్తాలో దాచిన రైతు
- విషయం తెలియక ఆ బస్తాను అమ్మేసిన ఇల్లాలు
- డబ్బులు పోవడంతో రైతు ఆందోళన
- ధాన్యం కొన్న వ్యాపారి ఆచూకీ కోసం గాలింపు
- భూపాలపల్లి జిల్లా గణపురంలో ఘటన
గత బుధవారం విడి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి వాహనంలో గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరయ్య భార్య.. భర్త డబ్బులు దాచిన ఆ ధాన్యం బస్తాను ఇతర ధాన్యంతో పాటు ఆ వ్యాపారికి అమ్మేసింది. పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన వీరయ్యకు ధాన్యం బస్తా కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.
వెంటనే భార్యను ఆరా తీయగా ధాన్యం బస్తాను వ్యాపారికి అమ్మినట్టు ఆమె తెలిపింది. దీంతో వీరయ్య హతాశుడయ్యాడు. వెంటనే ఆ వ్యాపారి కోసం గ్రామంలో గాలించినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ దంపతులు శనివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. వ్యాపారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.