ఐపీఎల్ రీస్టార్ట్‌కు పొంచి ఉన్న‌ వ‌రుణుడి గండం

  • ఇవాళ బెంగ‌ళూరులో జ‌రిగే కేకేఆర్‌, ఆర్‌సీబీ మ్యాచ్‌తో రీస్టార్ట్‌
  • ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంద‌న్న‌ వాతావ‌ర‌ణ శాఖ 
  • వ‌ర్షం కార‌ణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్ర‌మాదం
పాక్‌, భార‌త్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ 2025 వారం రోజుల పాటు ఆగిపోయిన‌ విష‌యం తెలిసిందే. అయితే, ఈరోజు నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ అవుతోంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌ల‌ను ఆరు న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. ఈరోజు రాత్రి 7.30 గంట‌ల‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) మ‌ధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది.  

అయితే, ఈ మ్యాచ్‌కు వ‌రుణుడి గండం పొంచి ఉంది. ఈ మేర‌కు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. వ‌ర్షం కార‌ణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకునిపోయే ప్ర‌మాద‌మూ ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ, చిన్న‌స్వామి స్టేడియంలో అత్యున్న డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఉండ‌టం అనేది కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యం. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు క‌రుణిస్తే ఐపీఎల్ రీస్టార్ట్ ఘ‌నంగా జరుగుతుంది. అందుకే అభిమానులు వ‌రుణ దేవుడిని ఇవాళ క‌రుణించాల‌ని ప్రార్థిస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ అద్భుతంగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఆ జ‌ట్టు 11 మ్యాచులాడి 8 విజ‌యాల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరిన తొలిజ‌ట్టుగా నిలుస్తుంది. మ‌రోవైపు ఆడిన 12 మ్యాచుల్లో ఐదు విజ‌యాలు న‌మోదు చేసింది. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో ఉంది. ఇక‌, ఈ మ్యాచ్ ఓడినా లేక గెలిచినా ఆ జ‌ట్టుకు ఎలాంటి ఉప‌యోగం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టికే కేకేఆర్ ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను దాదాపు కోల్పోయింది.    


More Telugu News