బాలకృష్ణ 'మాన్షన్ హౌస్' యాడ్ చూశారా!... సినిమా రేంజ్ లో ఎంట్రీ!
- మాన్షన్ హౌస్ యాడ్ లో నటించిన బాలకృష్ణ
- ప్రోమో వీడియో పంచుకున్న సంస్థ
- సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రోమో
మాన్షన్ హౌస్ డ్రింక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా మాన్షన్ హౌస్ యాడ్ లో నటించారు. ఒక్కసారి నేను అడుగుపెడితే (వన్స్ ఐ స్టెప్ ఇన్) అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ ఇవ్వడం ఈ యాడ్ వీడియోలో చూడొచ్చు.
ఈ యాడ్ ప్రోమో వీడియోను తన యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేసిన మాన్షన్ హౌస్... "ఒక ప్రాచీన తాళం చెవి. ఒక అద్భుతమైన సింహాసనం, మరియు అపారమైన శక్తితో కూడిన ఒక లెజెండ్. భారీ స్థాయిలో ఏదో రాబోతోంది! కానీ ఒక్క విషయం మాత్రం నిజం... ఈ సారి స్వాగతం మామూలుగా ఉండదు... సినిమాటిక్ విస్ఫోటనానికి సిద్ధంగా ఉండండి... అది ఎన్ బీకే అభిమాన గృహానికి దారి తీస్తుంది" అంటూ భారీ క్యాప్షన్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో అయితే, ఈ మాన్షన్ హౌస్ వీడియో బాలయ్య అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.