చెరువులా మారిన మైదానం... ఆర్‌సీబీ ప్లేయ‌ర్ ఆట‌లు.. ఆస‌క్తిక‌ర వీడియో షేర్ ఫ్రాంచైజీ!

  • రేపు బెంగ‌ళూరు వేదిక‌గా కేకేఆర్‌, ఆర్‌సీబీ మ్యాచ్
  • ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ పునఃప్రారంభం
  • నిన్న కురిసిన భారీ వ‌ర్షానికి చెరువులా మారిన చిన్న‌స్వామి స్టేడియం
  • చిన్న‌పిల్లాడిలా మారిపోయిన ఆర్‌సీబీ ఆట‌గాడు టీమ్ డేవిడ్ నీటిలో ఆట‌లు
భార‌త్‌-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావ‌ర‌ణం కార‌ణంగా వారం రోజుల పాటు వాయిదా ప‌డ్డ ఐపీఎల్ రేప‌టి (శ‌నివారం) నుంచి పునఃప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. బెంగ‌ళూర‌లోని చిన్న‌స్వామి స్టేడియంలో రేపు రాత్రి 7.30 గంట‌ల‌కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. 

అయితే, గురువారం బెంగ‌ళూరులో కురిసిన భారీ వ‌ర్షానికి ఈ మ్యాచ్ జ‌ర‌గాల్సిన చిన్న‌స్వామి మైదానం చెరువులా మారింది. దీంతో చిన్న‌పిల్లాడిలా మారిపోయిన ఆర్‌సీబీ ఆట‌గాడు టీమ్ డేవిడ్ నీటిలో ఆట‌లాడాడు. అత‌డిని జ‌ట్టు ఆట‌గాళ్లు ఉత్సాహ‌ప‌రిచారు. 

ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసింది. దీనికి "టీమ్ డేవిడ్ కాదు.. స్వీమ్ డేవిడ్" అనే క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

మ‌రోవైపు బెంగ‌ళూరులో వ‌ర్సాల వ‌ల్ల రేప‌టి మ్యాచ్ జ‌రుగుతుందా? లేదా? అని అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ రీస్టార్ట్ అవుతున్నందున అభిమానులు ఈ గేమ్ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రి చూడాలి వ‌రుణ దేవుడు క‌రుణిస్తాడో? లేదో?. 




More Telugu News