ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఎద్దు వీరంగం.. నెట్టింట వీడియో వైరల్!
ఇక పాటల జోష్‌కు జోరుగా డ్యాన్స్‌లు చేస్తున్న వేళ.. ఆ ఎద్దు ఒక్కసారిగా విజృంభించింది. అక్కడున్న వారిని తొక్కుకుంటూ వేదికపైకి దూసుకెళ్లింది. అటు నుంచి మళ్లీ స్టేజీ కిందకు గెంతులేస్తూ పరుగెత్తింది. దీంతో అక్కడున్న మహిళలు, చిన్నారులు భయంతో పరుగులు పెట్టారు. చివరకు ఆ ఎద్దును ఎలాగోలా అక్కడున్న యువకులు బంధించారు. కాగా, ఎద్దు దాడిలో పలువురు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది తెలియరాలేదు.