ఫుట్ బాల్ అరంగేట్రం చేసిన స్టార్ ఆటగాడు రొనాల్డో కొడుకు... జపాన్ పై పోర్చుగల్ విన్
- తండ్రి బాటలో తనయుడు
- పోర్చుగల్ అండర్-15 జట్టుకు రొనాల్డో కుమారుడు
- కొడుకు అరంగేట్రంపై రొనాల్డో ఆనందం
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా ఖ్యాతిగాంచిన క్రిస్టియానో రొనాల్డో కుమారుడు, క్రిస్టియానో డాస్ శాంటోస్ జూనియర్, తన తండ్రి బాటలోనే పయనిస్తూ ఫుట్‌బాల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన వ్లాట్కో మార్కోవిక్ అంతర్జాతీయ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో పోర్చుగల్ అండర్-15 జాతీయ జట్టు తరఫున క్రిస్టియానో జూనియర్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ యువ జట్టు 4-1 తేడాతో జపాన్‌పై ఘన విజయం సాధించింది.
తన కుమారుడు పోర్చుగల్ జట్టులోకి అరంగేట్రం చేయడం పట్ల క్రిస్టియానో రొనాల్డో ఆనందం వ్యక్తం చేస్తూ, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభినందనలు తెలియజేశాడు. "బిడ్డా... పోర్చుగల్ తరఫున నీ అరంగేట్రానికి అభినందనలు. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను!" అని రొనాల్డో పేర్కొన్నారు.
కాగా, ఈ సాకర్ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు జూనియర్ రొనాల్డోతో సెల్ఫీలకు ఆసక్తి చూపించారు. కాగా, తన తండ్రి సీనియర్ రొనాల్డో తరహాలోనే జూనియర్ కూడా నెం.7 జెర్సీనే ధరించడం విశేషం.