Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జమ్మూలోని శంభూ ఆలయంపై పాక్ దాడి.. వీడియో ఇదిగో!

Pakistan Attacks Shambhu Temple in Jammu Video Evidence Released
Advertisement
--
Advertisement
భారత్ తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. భారత్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ప్రపంచానికి చెబుతోంది. వాస్తవంలో మాత్రం సరిహద్దుల్లోని జనావాసాలు, ఆలయాలు, గురుద్వారాలను పాక్ బలగాలు టార్గెట్ చేశాయి. పాక్ చేస్తున్న ఈ బుకాయింపులను ఆధారాలతో సహా భారత్ బయటపెట్టింది. జమ్మూలోని శంభూ దేవాలయంపై పాకిస్థాన్ జరిపిన దాడి వివరాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.

ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. పాక్ బాంబుల ధాటికి శంభూ ఆలయంలో జరిగిన విధ్వంసాన్ని వీడియో ద్వారా బయటపెట్టింది. జమ్మూలోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాక్‌ నిరంతరం దాడులకు తెగబడుతోందని కేంద్రం పేర్కొంది. శంభూ దేవాలయం ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫొటోలు, వీడియోను విడుదల చేసింది. రాత్రంతా డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉందని.. భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొందని తెలిపింది.
Advertisement
Advertisement
Shambhu Temple Attack
Pakistan-India Conflict
Jammu and Kashmir
Cross-border shelling
Drone attacks
India-Pakistan border
Temple destruction
Pakistan aggression
Military conflict
Video evidence

More Telugu News