హై అలర్ట్‌లోనే ఢిల్లీ.. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
"పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సున్నితమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరిస్తున్నాం. రాత్రిపూట నిఘా ముమ్మరం చేశాం" అని అధికారులు తెలిపారు. ఇక, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే దేశంలో 24 విమానశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే దేశ రాజధానికి రాకపోకలు కొనసాగించే పలు విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇండియా గేట్ వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులను అధికారులు ఆదేశించారు.