హైడ్రా అలాంటి సమస్యలను కూడా పరిష్కరిస్తోంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- సికింద్రాబాద్ బుద్ధ భవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్టేషన్, వాహనాలు, యంత్రాల ఆవిష్కరణ
- ముంపు బాధితుల సమస్యలకు తక్షణమే పరిష్కారం అందిస్తున్న హైడ్రా
- ఏ శాఖ పరిధిలోని సమస్య అయినా హైడ్రా పరిష్కరిస్తుందని కమిషనర్ రంగనాథ్ వెల్లడి
- హైడ్రా కృషితో చెరువులు, నాలాల కబ్జాలు తగ్గుముఖం
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ప్రజలు ఏ ప్రభుత్వ విభాగాన్ని సంప్రదించాలో తెలియని క్లిష్టమైన సమస్యలను సైతం హైడ్రా స్వీకరించి, పరిష్కరిస్తోందని తెలిపారు.
"ఏదైనా సమస్య మా పరిధిలోకి రాదని చెప్పి మేం ఎప్పుడూ గిరిగీసుకోలేదు. ఏ శాఖకు సంబంధించిన బాధ్యత అయినా, తక్షణమే స్పందించి ఆ పనిని మేం పూర్తి చేస్తున్నాం" అని వివరించారు. హైడ్రా చొరవ కారణంగా నగరంలో చెరువులు, నాలాల ఆక్రమణలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను ఆయన వివరంగా తెలియజేశారు.