Praveen Sood: సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్ సర్వీస్ పొడిగింపు

CBI Chief Praveen Soods Service Extended by a Year
షార్ట్స్‌లో చూడండి
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సర్వీస్ ను కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. కొత్త సీబీఐ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ పదవీకాలం పొడిగింపునకు అపాయింట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రవీణ్ సూద్ పదవీకాలం వాస్తవానికి ఈ నెల 24తో ముగియాల్సి ఉంది. 

1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ 1989లో మైసూరులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆప్ పోలీస్ గా తన పోలీస్ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత బళ్లారి, రాయచూర్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. 


Go Back to Shorts
Praveen Sood
CBI Director
Service Extension
Central Government
Appointment Committee of Cabinet
IPS Officer
Karnataka Police
India
Government Appointment
Bureaucracy

More Telugu News