పాకిస్థాన్ కు ఘనవిజయం... సెటైర్ వేసిన ప్రముఖ క్రికెట్ అంపైర్

  • ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడిన భారత సైన్యం
  • పాక్ నెటిజన్ల తీరుపై అంపైర్ కెటిల్ బరో వ్యంగ్యం
  • వీడియో గేమ్ దృశ్యాలే వైమానిక దళ విజయాలట!
  • సోషల్ మీడియాలో పాక్ తీరుపై సెటైర్లు
ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో, మైదానంలో తన నిశితమైన నిర్ణయాలతో పాటు అప్పుడప్పుడు తనదైన శైలిలో చమక్కులతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన పాకిస్థాన్ పై వేసిన ఓ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో... పాకిస్థానీ నెటిజన్లు కొందరు వీడియో గేమ్ ఫుటేజ్‌ను తమ వైమానిక దళం సాధించిన విజయంగా చిత్రీకరించుకుంటున్న తీరుపై కెటిల్ బరో వ్యంగ్యంగా స్పందించారు.

పాకిస్థాన్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, ఎక్స్ వేదికగా, వివిధ వీడియో గేమ్‌లకు సంబంధించిన క్లిప్పింగులను పోస్ట్ చేస్తూ, అవి తమ పాకిస్థాన్ వైమానిక దళం సాధించిన ఘన విజయాలని ప్రచారం చేసుకుంటున్నారు. ఆ వీడియోలో ఓ యుద్ధ విమానం శతఘ్ని కాల్పుల్లో కూలిపోయినట్టు కనిపించింది. అయితే వాస్తవ దూరమైన ఈ ప్రచారం కాసేపట్లోనే నవ్వులపాలైంది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో స్పందించారు.

"పాకిస్థాన్ వైమానిక దళం 'గేమ్ ప్లే'లో సాధించిన ఈ భారీ విజయం నిజంగా అమోఘం. కొన్నిసార్లు మైదానంలో జరిగే అసలు ఆట కంటే ఇలాంటి 'ఆఫ్-ఫీల్డ్' ప్రదర్శనలే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తాయి!" అని ఆయన ఎత్తిపొడిచారు.


More Telugu News