Rajinikanth: రజనీకాంత్ 'కూలీ' వచ్చేది ఆ రోజే!

Rajinikanths coolie Release Date Announced

  • రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా విడుదలకు మూహూర్తం ఖరారు
  • ఆగస్టు 14న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం
  • కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న నాగార్జున

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల తేదీపై రూమర్లు వచ్చాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అందరూ ఊహించినట్లే విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ ఆడియోను విడుదల చేశారు. ఇందులో రజినీకాంత్ లుక్‌ను, అలానే నాగార్జున విజిల్ వేస్తున్న సన్నివేశాలను చూపించారు.

ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో కనబడనున్నారు. శృతిహాసన్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Rajinikanth
coolie
Lokesh Kanagaraj
Release Date
August 14
Nagarguna
Shruti Haasan
Huzza Hegde
Sun Pictures
Anirudh Ravichander
  • Loading...

More Telugu News