హిట్-3 గురించి అద్బుతమైన వార్తలు వింటున్నాను: రామ్ చరణ్

  • మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్-3
  • నాని-శైలేష్ కొలను కాంబోలో వచ్చిన చిత్రం
  • బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం
  • చిత్రబృందానికి అభినందనలు తెలిపిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన హిట్-3 చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మే 1న విడుదలైన ఈ చిత్రం నాని కెరీర్ లోనే భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'హిట్ 3' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా గురించి అద్భుతమైన సమీక్షలు వింటున్నానని వెల్లడించారు. చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు. 

'హిట్ 3' సినిమా అద్భుతమైన విజయం సాధించడం పట్ల రామ్ చరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  నా ఆత్మీయ సోదరుడు నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, విభిన్న జానర్లలో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తున్నాడంటూ కొనియాడారు.

అంతేకాకుండా, ఈ ఉత్కంఠభరితమైన చిత్రాన్ని అద్భుతంగా రాసి, అంతే ప్రతిభావంతంగా తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను పనితీరును కూడా రామ్ చరణ్ మెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పారు.

ఈ చిత్ర విజయంలో భాగస్వాములైన నటి శ్రీనిధి శెట్టి, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని, వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బృందాలకు కూడా రామ్ చరణ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఘన విజయం పట్ల మొత్తం చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. 


More Telugu News