అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుపై వేటు.. కార‌ణ‌మిదే!

  • జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు మైక్ వాల్జ్‌పై అధ్య‌క్షుడు ట్రంప్ వేటు
  • తాత్కాలిక ఎన్ఎస్ఏగా విదేశాంగ‌శాఖ మంత్రి రుబియో నియామ‌కం
  • హూతీ తిరుగుబాటుదారుల‌పై దాడుల‌ స‌మాచారం ముందుగానే పాత్రికేయుడికి 
  • వాల్జ్ చిన్న‌ పొర‌పాటు కార‌ణంగా ఇది జ‌రిగిన వైనం
అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు (ఎన్ఎస్ఏ) మైక్ వాల్జ్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. ఆయ‌న స్థానంలో తాత్కాలిక జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా విదేశాంగ‌శాఖ మంత్రి రుబియోను నియ‌మిస్తూ ట్రంప్ నిర్ణ‌యం తీసుకున్నారు. వాల్జ్‌ను ఐక్య‌రాజ్య స‌మితి రాయ‌బారిగా నియ‌మించారు. 

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల‌పై దాడుల‌కు సంబంధించిన స‌మాచారం ముందుగానే సిగ్న‌ల్ యాప్ చాట్ ద్వారా ఓ పాత్రికేయుడికి చేరింది. తాను అధికారుల‌తో క్రియేట్ చేసిన గ్రూపులో వాల్జ్ పొర‌పాటున ఆ పాత్రికేయుడిని చేర్చ‌డం ద్వారా ఇది జ‌రిగింది. దీనికి త‌న‌దే బాధ్య‌త అని వాల్జ్ ప్ర‌క‌టించారు. దాంతో ఆయ‌న‌ను ఎన్ఎస్ఏ ప‌ద‌వి నుంచి ట్రంప్‌ తొల‌గించారు.   


More Telugu News