పహల్గామ్ దాడి.. వర్షం పడడంతో ఉగ్రవాదుల ప్లాన్ ఛేంజ్
- రెండు రోజుల ముందే దాడికి ప్రణాళిక
- వర్షం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో దాడి వాయిదా
- ఏప్రిల్ 22న ఫుడ్ స్టాల్ వద్ద వేచి చూసి పర్యాటకుల రద్దీ పెరిగాక దాడి
ఈ నెల 22న బైసరన్ వ్యాలీలో పర్యాటకుల రద్దీ పెరిగే వరకూ ఉగ్రవాదులు ఎదురుచూశారని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న ఓ ఫుడ్ స్టాల్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు వేచి ఉన్నారని తెలిసిందన్నారు. అయితే, ఇక్కడ వేచి ఉండడానికి కారణం పర్యాటకుల రద్దీ కోసమేనా లేక ఏదైనా సంకేతం కోసమా అనే కోణంలో కూడా పరిశోధన చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పర్యాటకుల రద్దీ పెరిగాక షాపుల్లోకి వెళ్లి మారణకాండ సృష్టించారని చెప్పారు. సాధారణంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు కానీ బైసరన్ వ్యాలీలో మాత్రం బాధితుల తలను గురి చూసి కాల్చారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పర్యాటకులను మతం అడిగి ముస్లిమేతరులను వేరుగా నిలబెట్టి కాల్చి చంపారని వివరించారు.