దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు... వెయ్యి పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్

  • కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు
  • 289 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతానికి పైగా లాభపడ్డ రిలయన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఓ వైపు ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ... విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, బ్లూ చిప్ కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాల కారణంగా మన సూచీలు రాణించాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,005 పాయింట్లు లాభపడి 80,218కి ఎగబాకింది. నిఫ్టీ 289 పాయింట్లు పెరిగి 24,328 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో మన రూపాయి మారకం విలువ 37 పైసలు బలపడి రూ. 85.04గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
రిలయన్స్ (5.27%), సన్ ఫార్మా (3.08%), టాటా స్టీల్ (2.42%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.36%), యాక్సిస్ బ్యాంక్ (2.35%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.89%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.05%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.52%), నెస్లే ఇండియా (-0.42%), బజాజ్ ఫైనాన్స్ (-0.21%).


More Telugu News