ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో కాళేశ్వరం ఎండీ అరెస్ట్

  • కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు కేసు నమోదు
  • హరిరామ్ కు చెందిన 14 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు
  • కీలక రికార్డులు స్వాధీనం
  • భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ భూక్యా హరిరామ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని 14 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో హరిరామ్‌కు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆయనతో పాటు బంధువుల పేరుతో విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్, నార్సింగి ప్రాంతాల్లో ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అమరావతిలో వాణిజ్య స్థలం, మార్కుక్ మండలంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. శ్రీనగర్ కాలనీలో ఇళ్లు, బొమ్మలరామారంలో మామిడితోటలతో పాటు ఫామ్ హౌస్ ఉన్నట్లు తేలింది. ఈ తనిఖీల్లో విలువైన రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


More Telugu News