తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
- ఫలితాలను విడుదల చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణత
- సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత
సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరు కాగా... 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ లో చూడోచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి, రిజల్ట్ చూసుకోవచ్చు.
కాగా, మార్చి 5 నుంచి 25 వరకు 1,532 కేంద్రాల్లో ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షలకు మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.