హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం... వాతావరణ శాఖ అలర్ట్

  • రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం
  • సిద్దిపేట, మెదక్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వర్ష సూచన
  • వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపింది.

ఇదిలా ఉండగా, ఈ రోజు సాయంత్రం నుంచి ఎల్లుండి ఉదయం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.


More Telugu News